కొత్త‌గూడెం ల‌క్ష దీపోత్సవం విజ‌య‌వంతం చేసిన ప్ర‌తీ ఒక్క‌రికీ ధ‌న్య‌వాదాలు – రంగాకిర‌ణ్ ( ఆర్కే)

పొలిటిక‌ల్ వాయిస్ , కొత్త‌గూడెం : కొత్త‌గూడెం ప‌ట్ట‌ణం ప్ర‌కాశం స్టేడియం లో నిర్వ‌హించిన ల‌క్ష‌దీపోత్స‌వం కార్య‌క్ర‌మాన్ని ఘ‌న‌విజ‌యం చేసిన ప్ర‌జ‌ల‌కు , సేవ‌కుల‌కు, భ‌క్త‌కోటికి, రెవెన్యూ,మున్సిప‌ల్, పంచాయ‌తీ మ‌రియు పోలీసు సిబ్బందికి కార్య‌క్ర‌మ నిర్వాహ‌కులు ఆర్కే డిజిట‌ర్ ఎండీ రంగాకిర‌ణ్ ధ‌న్య‌వాదాలు తెలిపారు.

కొత్త‌గూడెంలో లక్షదీపోత్స‌వం


కార్య‌క్ర‌మం ఇంత దిగ్విజ‌యం కావ‌డానికి ప్ర‌తీ ఒక్క‌రి స‌హ‌కారం వెల‌క‌ట్ట‌లేనిద‌ని , కార్తీక దీపోత్స‌వం ప‌ట్ల కొత్త‌గూడెం ప్ర‌జ‌ల ఆస‌క్తి , భ‌క్తి వ‌ల్ల‌నే ఈశ్వ‌రుడు ఇంత పెద్ద కార్య‌క్ర‌మం చేసే అవ‌కాశం ఇచ్చార‌ని తెలిపారు. లక్ష దీపోత్సవ కార్యక్రమం విజయవంతానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. 2019 లో మొద‌టి సారి కార్య‌క్ర‌మం నిర్వ‌హించిన‌ప్పుడు ప్ర‌జ‌లు శ్ర‌ద్దాసక్తుల‌తో వేలాది మంది స్వామి పరిపూర్ణానంద వారి ప్ర‌వ‌చ‌న‌ములు విన‌డానికి , ప‌విత్ర కార్తీక మాసంలో స్వ‌హ‌స్తాల‌తో ల‌క్ష దీపాల ఉత్స‌వంలో పాల్గొన్న త‌ర్వాత ఈ సారి రెట్టించిన ఉత్సాహంతో పురప్ర‌ముఖులు, ప్ర‌జ‌లు, భ‌క్తులు రావ‌డం అంతా భ‌గ‌వంతుని ద‌య అన్నారు .

ల‌క్ష‌దీపోత్స‌వంలో ఆశీర్వ‌చ‌నం ఇస్తోన్న స్వామీజీ


కొత్తగూడెం ప్ర‌జ‌లప‌ట్ల ప‌రిపూర్ణానంద స్వామి అత్యంత ఇబ్బందుల న‌డుమ కూడా ఆశీర్వ‌చ‌నం ఇవ్వ‌డం అదృష్టం అన్నారు . కార్య‌క్ర‌మానికి హ‌జ‌రైన నాయ‌కులు ఈటెల రాజేంద‌ర్, పొంగులేటి సుధాక‌ర్ రెడ్డి ల‌కు రంగాకిర‌ణ్ కృత‌జ్ఙ‌త‌లు తెలిపారు.

దేదీప్య‌మానంగా వెల‌గుతోన్న ల‌క్ష‌దీపాలు


కార్యక్రమంలో RSS కార్యవాహ చెవురి రామచంద్ర రావు ,ధర్మజగరణ సమితి నాగేశ్వరరావు, చింతలచెర్వు శ్రీనివాసరావు, జల్లారపు శ్రీనివాస్,సత్యడిజిటల్ ప్రసాద్, సాయి కిరణ్, కటికల రంజిత్, రాజేష్ నాయక్, చారి, తదితరులు పాల్గొన్నారు

వేదిక‌పై ప్ర‌ముఖులు
AD

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *