ప్రకాష్ రాజ్ టీమ్ నుండి ముగ్గురు ఔట్ ?

మా ఎన్నికల సమరంలో తెరవెనుక ఎం జరుగుతుందో అర్ధం కానీ పరిస్థితి. మీడియా ముందు మేమంతా ఒకటే అని చెప్పుకునే సెలబ్రెటీలు తెరవెనుకల కత్తులు దూస్తూ ఉంటారు. దీనికి ఉదాహరణగా..

మా ఎన్నికల్లో ఊహించని ట్విస్ట్.. ఆ అందరికీ దెబ్బ మామూలుగా లేదుగా! | new  twist in MAA Elections - Telugu Filmibeat

మెగా కాంపౌండ్ కంటెస్టెంట్ ప్రకాష్ రాజ్ ప్యానెల్ లో అప్పుడే లుకలుకలు మొదలైపోయాయి. మంచు విష్ణు, జీవితరాజశేఖర్, హేమ వంటి వారు ప్రకాష్ రాజ్ కి పోటీగా ఎన్నికల బరిలో దిగుతుండగా..

ఎల‌క్ష‌న్ల గురించి ప్ర‌కాష్‌రాజ్‌కు ఆతృత - జ‌ల‌క్క్ ఇచ్చిన నెటిజ‌న్లు |  Webdunia Telugu

ఏకంగా అందరికంటే ముందే మీడియా ప్రెస్ మీట్ పెట్టి తన ప్యానెల్ ని ప్రకటించి రేసులో దూసుకెళ్లాడు ప్రకాష్ రాజ్ . అయితే ఇప్పుడు తెరవెనుక ప్రకాష్ రాజ్ దూకుడుకి కళ్లెం వేసే పనులు జరుగుతున్నాయి.మా’ అసోసియేషన్ కు సంబంధించిన మరికొన్ని అంశాలు మీడియాలో వార్తలుగా వచ్చాయి.

ఇప్పటివరకు అధ్యక్ష స్థానం బరిలో ఉంటానని.. తాను విజయం సాధిస్తే.. ‘మా’ రూపురేఖలు మారుస్తానని చెప్పటమేకాదు.. తన ప్యానెల్ లో అందరూ ప్రశ్నించేవారేనని పేర్కొన్న ప్రకాశ్ రాజ్ కి తన ప్యానెల్ లోని ముగ్గురు సభ్యలు షాక్ ఇచ్చేలానే ఉన్నారు. స్వంతంత్ర భావాలున్న ఆ ముగ్గురు.. ప్రకాశ్ రాజ్ కు మద్దతు ఇవ్వలేమని తాజాగా తేల్చి చెప్పినట్లుగా తెలుస్తోంది.

Tollywood: ముక్కోణ‌పు పోరు కాదు.. హేమ కూడా పోటీకి సిద్ధ‌మైంది..! | The News  Qube

ఈ పరిణామం ప్రకాశ్ రాజ్ టీంలో కలకలంగా మారింది . ‘మా’ ఎన్నికల్లో పోటీ చేసి ఏదో మంచి చేయాలనే అనుకున్నాం కానీ.. లోతుల్లోకి వెళుతుంటే తమకు తెలియని ఎన్నో విషయాలు ఉన్నట్లుగా అర్థమవుతుందని.. అందుకే తాము మిడిల్ డ్రాప్ కావాలని డిసైడ్ అయినట్లుగా చెప్తున్నారట ఆ ముగ్గురు.అయితే ప్రకాష్ ప్యానల్ నుండి డ్రాప్ అవుతున్నట్టు మీడియా ముఖంగా ప్రకటన చేయడానికి వారు రెడీ అయిపోయారట.

Three out of Prakash Raj team Shock at first | ప్రకాశ్ రాజ్ టీం నుంచి  ముగ్గురు ఔట్? మొదట్లోనే షాక్? | Tupaki Telugu

కానీ మెగా కాంపౌండ్ సభ్యుల ఒత్తిడి మేరకు వారు బయటికి రావటం లేదట. మీరు బయటికి వస్తే తమ ప్యానల్ కు తీవ్ర నష్టం వాటిల్లుతుందని.. తొందరపడొద్దని సదరు ముగ్గురిని మెగా కాంపౌండ్ కోరుతున్నట్లు చెబుతున్నారు.

ఇక ఆ ముగ్గురు ఎవరన్న మ్యాటర్ పై ఫిలిం నగర్ లో చర్చ నడుస్తుంది. వాళ్ళల్లో ఇద్దరు ప్రముఖ టీవీ షో కమెడియన్, మరియు మరో ప్రముఖ లేడి యాంకర్ అంటూ వార్తలొస్తున్నాయి. బుల్లితెరలో ఫుల్ స్వింగ్ లో నడుస్తున్న వారి కెరీర్ ఇబ్బందుల్లో పడొద్దని ఈ నిర్ణయానికి వచ్చారట ఆ ఇద్దరు. ఇక ఆ మూడో వ్యక్తి ఎవరన్నది ఇంకా క్లారిటీ రావాల్సివుంది.

MAA Election: 'మా' ఎన్నికల బరిలో విష్ణు

అయితే ప్రకాష్ రాజ్ కి మద్దత్తు ఇవ్వకుండా తెరవెనుక కథ నడిపిస్తుంది ఎవరు, తమ ప్యానెల్ వారిని ఎవరైనా బెదిరిస్తున్నారా.. అంటూ ప్రకాష్ రాజ్ టీమ్ కనుక్కునే పనిలో పడ్డారట. మరీ వ్యవహారం ఏ మలుపు తిరుగుతుందో చూడాలి.

AD

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *