డాక్ట‌ర్ పార్థ‌సార‌ధికి రక్ష‌ణ‌శాఖ‌లోని భార‌త్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ కంపెనీలో స్వ‌తంత్ర హోదాతో డైరైక్ట‌ర్ ప‌దవి

పొలిటిక‌ల్ వాయిస్ : బీజేపీనాయ‌కుడు, పార్ధ డెంట‌ల్స్ అధినేత డాక్ట‌ర్ పార్ధ‌సార‌ధికి కేంద్ర‌ప్ర‌భుత్వం చాలా పెద్ద బాధ్య‌త‌లనిచ్చింది. ర‌క్ష‌ణ శాఖ‌లోని ఉత్ప‌త్తుల విభాగంలోని భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ కంపెనీలో స్వ‌తంత్ర హోదాతో డైరెక్ట‌ర్ ప‌దవిలో నియామ‌కం చేసింది. ఈ మేర‌కు బీఈఎల్ చైర్మ‌న్ అండ్ మేనేజిండ్ డైరెక్ట‌ర్ ఉత్త‌రం కూడా రాశారు. దేశీయ రక్ష‌ణ రంగ ఉత్ప‌త్తుల‌ను త‌యారు చేయ‌డంలో బీఈఎల్ విశేషంగా కృషిచేస్తోంది. క‌ర్నూల నుంచి 2019 లో ఎంపీ అభ్య‌ర్ధిగా పోటీచేసిన డాక్ట‌ర్ పార్ధ‌సార‌ది ప్ర‌స్తుతం బీజేపీ ఓబీసీ మోర్యా జాతీయ కార్య‌ద‌ర్శిగా పార్టీలో ప‌నిచేస్తున్నారు .

          ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాని మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్ నాధ్ సింగ్, బీజేపీ రాష్ట్ర అద్య‌క్షుడు సోము వీర్రాజులుకు డాక్ట‌ర్ పార్ధ‌సార‌ధి కృత‌జ్ఙ‌త‌లు తెలిపారు. కేంద్ర ప్ర‌భుత్వం త‌న‌పై న‌మ్మ‌కంతో ఇంత పెద్ద ప‌ద‌వి ఇచ్చి గుర్తించినందుకు బీజేపీ జాతీయ పార్టీకి , రాష్ట్ర పార్టీ పెద్ద‌లంద‌రికీ ప్ర‌త్యేకంగా ధ‌న్య‌వాదాలు తెలిపారు. కేంద్ర స‌ర్కారు నిబంధ‌న‌ల మేర‌కు మ‌రింత శాయ‌శ‌క్తులా కృషి చేస్తాన‌ని డాక్ట‌ర్ పార్ధ‌సార‌ధి తెలిపారు. 
AD

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *